చాక్‌పీసులు, డస్టర్లు కూడా లేవు
గాల్లో దీపంలా విద్యావ్యవస్థ
కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తం
ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తిన కేటీఆర్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్‌పీసులు-డస్టర్లులేని స్కూళ్లు, అద్దె చెల్లించలేదని కాలేజీకి తాళాలు, రోడ్లపైకి విద్యార్థులు తెలంగాణలో కనిపిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) ద్వారా కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలకు సంబంధించిన పలు వార్త కథనాలను ట్వీట్టర్ (ఎక్స్)లో షేర్ చేశారు.
మంత్రి లేని విద్యాశాఖ..
పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా గ్రాంట్స్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అని కేటీఆర్ విమర్శించారు. విద్యా శాఖకు మంత్రి లేడని.. శాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి దిక్కు లేడని అన్నారు. పదుల సంఖ్యలో ఢిల్లీకి చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి మీ సొంత నియోజకవర్గంలో అధ్యాపకులు లేక విద్యార్థులు టీసీలు తీస్కొని వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యా శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపి సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లల బంగారు భవిష్యత్తుతో చెలగాటం వద్దని హెచ్చరించారు.
కమలాదే పైచేయి
అధ్యక్ష ఎన్నికలతో అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మొదటిసారి ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. ట్రంప్‌తో జరిగిన ఈ డిబేట్‌లో కమలా దూకుడు ప్రదర్శించారు. ట్రంప్ విధానాలను ఎండగట్టారు.
కమలాదే పై చేయి..
ఈ చర్చలో ట్రంప్‌పై కమలా చేసిన ఎదురుదాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. కమలా హారిస్ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అంటూ కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కమలా హారిస్ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అనిపించింది.. ఈ ఏడాది చివర్లో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి’ అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ వైరల్‌గా మారింది.