ఇంకా శుద్ది ఎందుకంటూ కాంగ్రెస్ నేతలకు కెటిఆర్ ప్రశ్న
మీ రాజకీయాలు రోత పుట్టిస్తున్నాయి రేవంత్
రాహుల్ జీ మీ వాళ్లను మానసిక వైద్యుల వద్దకు పంపండి..
హైదరాబాద్: మూసీ మురికి అంతా మీ వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ ను ప్రశ్నించారు.. ఈ మేరకు ఆయన నేడు ట్విట్ చేశారు. 55 కిలోమీటర్ల మూసి నదికి లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు? అంటూ నిలదీశారు.. ఇక తనపై ఆరోపణలు చేసిన మంత్రికి లీగల్ నోటీసులు పంపామని చెప్పారు. కాంగ్రెస్ అసహ్యకరమైన, విసుగు పుటించే రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. మంత్రిని, సీఎంని మానసిక ఆరోగ్య నిపుణుడి వద్దకు లేదా రీహాబిటేషన్ సెంటర్లకు ట్రీట్మెంట్‌కు పంపించాలంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని కేటీఆర్ కోరారు.
మీ ధన దాహనికి ఎంత మంది బలికావాలి…
మూసీ కూల్చివేతల భయంతో గానద శ్రీకుమార్ అనే మేస్త్రీ గుండెపోటుతో మరణించడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇంటికి రూ.25 వేలు ఇస్తామని అధికారులు ప్రకటించడంపై ఫైరయ్యారు. గుండెలు ఆగిపోతున్నా, కుటుంబాలు విడిపోతున్నా సర్కార్ దాహం తగ్గడం లేదంటూ విమర్శించారు. . కష్టపడి పస్తులుండి పైసా పైసా కూడేసి, బ్యాంకు నుంచి అప్పు తెచ్చి కట్టిన గుడును కూల్చుతారని భయంతో ప్రాణాలు పోతున్నాయని వాపోయారు. 16 కాదు 18 మంది అయినా సరే ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను రోడ్డుకు ఈడ్చి కుటుంబాల్లో చిచ్చులు పెట్టిన మూర్కుడు రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు.