Thursday, December 12, 2024

TG – మీ దుశ్శాస‌న ప‌ర్వానికి ఆడ‌బిడ్డ‌లు త‌గిన బుద్ది చెబుతారు – కెటిఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని ఆశా వర్కర్లు నిరసన తెలిపితే కనీసం మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చుకొని వెళ్తారా? అంటూ రేవంత్ ను నిల‌దీశారు బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ .. నిన్న‌ పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఆశావర్కర్లను ఉస్మానియా ఆస్పత్రిలో నేడు పరామర్శించారు.. వారికి ధైర్యం చెప్పారు.. వారు చేస్తున్న ఆందోళ‌నకు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తున‌ట్లు చెప్పారు.

ఆనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, పోలీసులతో రేవంత్ సర్కార్ చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మరిచిపోర‌న్నారు. త‌గిన స‌మ‌యంలో ఆడ‌బిడ్డ‌లు కాంగ్రెస్ కు బుద్ది చెబుతార‌ని హెచ్చ‌రించారు. హమీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని.. నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు.
కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆశావర్కర్లు సేవలందించార‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఆందోళన చేపట్టార‌ని వివ‌రించారు. వారిపై జ‌రిగిన దౌర్జ‌న్య ఘటనపై మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తామ‌న్నారు కెటిఆర్ . ఆడబిడ్డలపై చేయి చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాల‌ని డిమాండ్ చేశారు.. ఆశా వర్కర్ల తరఫున ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామ‌ని తేల్చి చెప్పారు. వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం అని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement