కొందరు రైతులలోనే సంతోషం…
అధిక సంఖ్యలో రైతులలో విషాదం
అందిన వారికంటే అందని వారే అధికం
కాంగ్రెస్ విధించిన నిబంధనలే రైతులకు మరణ శాసనం
శోకంలో రైతులుంటే సంబురాలా..
అప్పుడు అటెన్షన్ డైవర్షన్..! ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!
కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి ధ్వజం
ఆంధ్రపభ స్మార్ట్ – హైదరాబాద్ – రేవంత్ సర్కార్ చేసిన రుణమాఫీ తీరు చారాణ కోడికి… బారాణ మసాలా లా ఉందన్నారు మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. ఈ మేరకు ఆయన ఎక్ లో ట్విట్ చేశారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు.. రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలు అయ్యాయని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉన్న సమయంలో ఈ సంబురాలు ఎందుకు..? అని ప్రశ్నించారు. మభ్యపెట్టే మీ పాలన గురించి.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..! ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!! అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.