Sunday, November 17, 2024

TG – భూసేకరణపై మీ రణ గర్జన తెలంగాణ‌కు వ‌ర్తించ‌దా.. రాహుల్ గాంధీ ప్ర‌శ్నించిన కెటిఆర్

మీరు చేసేవ‌న్నీ కుమ్మ‌క్కు రాజ‌కీయాలు
ల‌గ‌చ‌ర్ల గిరిజ‌నులు క‌న్నీళ్లను ఎందుకు ఆప‌లేక‌పోయారు
అదాని చేతికి రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకిచ్చారు
ఇది మీ పార్టీ పాల‌నలో ఉన్న రాష్ట్ర‌మే క‌దా
మ‌రి ఇన్నింటిని ఎందుకు అడ్డుకోలేక‌పోతున్నారు
నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందం ఉందా
రాహుల్ గాంధీ ప్ర‌శ్నించిన కెటిఆర్

హైద‌రాబాద్ – రైతులకు మద్దతిస్తామన్న రాహుట్‌ గాంధీ వ్యాఖ్యల‌పై బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిప‌డ్డారు.. దేశంలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారా..? అంటూ రాహుల్ గాంధీ ని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఎక్స్ ఖాతాలో నేడు ట్విట్ చేశారు.
‘రాహుల్ గాంధీ జీ.. మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం? అదాని – అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం?” అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఏళ్ల తరబడి దోపిడీ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీని తెరిచేందుకు అదానీ గ్రూప్‌ను ఎందుకు అనుమతించిందని, కొడంగల్‌లో రైతులు కన్నీటికి ఎందుకు కారణభూతమైందని ఎక్స్‌ పోస్ట్‌లో కేటీఆర్ విమర్శించారు.

”దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన.. తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది? కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది? అదాని -అంబానీలపై మీ జంగ్.. రామన్నపేటలో అదాని ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచింది? తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా!ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?” అని రాహుల్‌ గాంధీని కేటీఆర్‌ ప్రశ్నించారు. ”నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా? కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా? రేవంత్ – అదానీలతో వ్యాపార బంధమా?” అని కేటీఆర్‌ పలు అనుమానాలను లేవనెత్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement