Friday, October 4, 2024

TG – మీ వాళ్లూ వంత పాడుతున్నారు…డిజిపితో కెటిఆర్

హైద‌రాబాద్ – తిరుమలగిరిలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా శిబిరంపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిపై బిఆర్ఎస్ నేతలు డిజిపి జితేంద‌ర్ రెడ్డికి నేడు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారని ఆరోపించారు. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరంపై దాడి చేయడం, టెంట్ పీకేసే కార్యక్రమాలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాయ‌క‌త్వంలోని ఒక బృందం డిజిపి కార్యాల‌యంలో జితేంద‌ర్ ను క‌ల‌సి ఒక విన‌తి ప‌త్రం అంద‌జేశారు..
రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపైనా కేటీఆర్ ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో రుణమాఫీ జరిగిన తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లికి పోయిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపైన, ఇతర జర్నలిస్టుల పైన దాడి చేసిన తీరునూ డిజిపి దృష్టికి తెచ్చారు. దాడుల‌కు పాల్ప‌డ్డ వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్నారని.. వారిపైన ఓ కన్నేసి ఉంచాలని కోరారు. ప్రతిపక్ష నాయకులపైన పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, చేస్తున్నా హింసపైన ఈ సందర్భంగా కేటీఆర్ డీజీపీకి అధారాల‌తో వివ‌రించారు. . రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పోలీస్ అధికారులు పాల్గొనడాన్ని కూడా కేటీఆర్‌.. డీజీపీకి గుర్తుచేశారు.

- Advertisement -

కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు జ‌గ‌దీశ్ రెడ్డి, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంక‌టేశ్‌తో పాటు ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement