ఎసిబి విచారణకు న్యాయవాదిని అనుమతించండి
లంచ్ మోషన్ దాఖలు చేసిన కెటిఆర్
విచారణ చేపట్టిన హైకోర్టు
కొనసాగుతున్న ఇరు వర్గాల వాదనలు
ఎజి సమయం కోరడంతో నాలుగు గంటల వరకు వాయిదా
హైదరాబాద్ – ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణకు తన వెంట లాయర్‌ను అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో నేటి ఉదయం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ధర్మాసనం ఆయన పిటిషన్‌ను స్వీకరించింది. దీనిపై మధ్యాహ్నం ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.. ఈ సందర్భంగా న్యాయవాదిని అనుమతించే లేదా.. విచారణను న్యాయవాది చూసే అవకాశం ఎసిబి చట్టంలో ఉందా అంటూ ప్రభుత్వ ఎజిని ప్రశ్నించారు న్యాయమూర్తి.. తనకు కొత్త సమయం కావాలని ఎజి కోరారు.. దీంతో విచారణకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత చేపడతామంటూ వాయిదా వేసింది.. అంతుకు ముందు కెటిఆర్ తో ఉండే ముగ్గురు న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని హైకోర్టు పిటిషనర్ తరుపు న్యాయవాదిని హైకోర్టు కోరింది.. దీంతో ముగ్గురు న్యాయవాదుల పేర్లు అందజేశారు.. . కాగా, ఈ కేసులో రేపు ఎసిబి ఎదుట కెటిఆర్ విచారణకు హాజరుకావాలసి ఉంది..