Sunday, November 24, 2024

TG – కెటిఆర్ ఓ జోక‌ర్ – మంత్రి కోమ‌టిరెడ్డి

హైద‌రాబాద్ – విద్యుత్ ఛార్జీల అంశంపై ఈఆర్సీ వద్దకు కేటీఆర్‌ వెళ్ళడం ఒక పెద్ద జోక్ అని, ఆయన ఒక జోకర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వాఖ్యానించారు. హైద‌రాబాద్ లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో ఒక్క సీటు రాకున్నా,అసెంబ్లీలో ఓడించినా కేటీఆర్‌కు బుద్ధి రాలేద‌న్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటును పేదవాళ్ళకు త‌మ ప్రభుత్వం ఇస్తోన్న‌ద‌ని గుర్తు చేశారు… కేంద్ర మంత్రులు సంజయ్,కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కి ఎంత నిధులు తెచ్చారు’అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే చోట

ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీని ‘రూ.49కోట్ల అంచనాతో అఘాఖాన్ ట్రస్ట్ ఆధునికీకరిస్తోంద‌ని మంత్రి వెల్ల‌డించారు.. ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించార‌ని తెలిపారు . నిజాం తరహాలో ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నార‌న్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహలో అసెంబ్లీ,కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు వెళ్లాలంటే వెహికిల్‌లో సీఎం మంత్రులు వెళ్లాల్సి వస్తుంద‌ని, రెండూ ఒకే దగ్గర ఉంటే స‌మ‌యం ఆదా అవుతుంద‌ని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement