Saturday, November 16, 2024

TG – దేవుళ్ల‌నే మోసం చేసిన ఏకైక సిఎం రేవంత్ రెడ్డి – కెటిఆర్

హైదరాబాద్‌: హైద‌రాబాద్ : రుణ‌మాఫీ విష‌యంలో దేవుళ్లను కూడా వదలకుండా ఏ దేవుని దగ్గరకు పోతే అక్కడ ఒట్లు వేసి వారిని సైతం మోసం చేసిన మొదటి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డినే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నేత మాల్యాద్రి నాయుడు, ఇతర నాయకులు గులాబీ గూటికి చేరారు. వీరంద‌రికి తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డితో పాటు ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, రైతు భ‌రోసా కింద ఎక‌రానికి రూ. 15 వేలు ఇస్తా అన్నార‌ని . దాని కోసం రాష్ట్ర రైతాంగం ఎదురుచూస్తోందని రేవంత్ కు గుర్తు చేశారు కెటిఆర్. మూడు పంట‌ల‌కు రైతు భ‌రోసా ఎక్క‌డ పోయింద‌ని,. వానాకాలం రైతుబంధు ఇంకా ఖాతాల్లో ప‌డ‌లేద‌ని దెప్పిపొడిచారు. .

డిసెంబ‌ర్ 9న రుణ‌మాఫీ చేస్తాన‌ని మాటిచ్చి త‌ప్పావు. ఇక ఆ త‌ర్వాత ఏ దేవుడి వ‌ద్ద‌కు వెళ్తే.. అక్క‌డ ఒట్లు. నిన్న దేవుళ్లంద‌రూ మీటింగ్ పెట్టుకున్నార‌ట‌.. వీడు ఎక్క‌డ దొరికిండ్రా నాయానా.. మ‌న‌కు ఏడ క‌న‌బ‌డితే అడ ఒట్లు వేస్తున్నాడ‌ని అనుకున్నారంట‌. మ‌న‌షుల‌ను మోసం చేసిన వారు ఉన్నారు. దేవుళ్ల‌ను మోసం చేసిన తొలి వ్య‌క్తి ఈయ‌నే. పంద్రాగస్ట్ లోపు రుణమాఫీ అంటివి. ఎగిరెగిరిపడితివి. హరీష్ రావుతో సవాల్ చేస్తివి. ఇప్పుడు ఏమైంది? మ‌రి ఏడ పోయింది రుణ‌మాఫీ.. జేపీ ద‌ర్గా వ‌ద్ద కూడా ఒట్టు పెడితివి. నీ ఒట్ల‌కు మెద‌క్ చ‌ర్చిలో ఏసుక్రీస్తు కూడా బాధ‌ప‌డుతున్నాడు అని కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని సాంకేతిక ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయ‌న్నారు. ఎత్తైన కుర్చీలు వేసుకుని కూర్చుంటున్నార‌ని, . లేదంటే రెండు కుర్చీలు వేసుకుని కూర్చుంటున్నార‌ని వివ‌రించారు. ఎత్త‌యిన కుర్చీలో కూర్చొంటే పెద్దోడివి అయిపోవు రేవంత్ రెడ్డి. ప్ర‌జ‌ల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ చుర‌క‌లంటించారు.

ఇక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ ప్ర‌జ‌లు చూపించిన చైత‌న్యానికి శిర‌సు వంచి పాదాభివంద‌నం చేస్తున్నా అని కేటీఆర్ పేర్కొన్నారు. 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క సీటు ఇత‌ర పార్టీల‌కు ఇవ్వ‌కుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించ‌డం గొప్ప విష‌య‌మ‌ని అన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కొంద‌రు మోస‌పోయారు. కానీ హైద‌రాబాద్ వాళ్లు మాత్రం మోస‌పోలేదు. కాంగ్రెసోళ్ల‌ మాట‌లు, వ్య‌వ‌హారం తెలుసు కాబ‌ట్టి.. 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో మీ చైత‌న్యాన్ని చూపించారు. రాజేంద్ర న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ప‌శ్చాత్త‌ప ప‌డే రోజు వ‌స్త‌ది. రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లు మాత్ర‌మే ఉంటాయి. మీరు గెలిపించిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు త‌ప్ప మీరు త‌ప్పు చేయ‌లేదు. మీరంతా పార్టీని వెన్నంటే ఉన్నారు. పార్టీలో ఇవాళ కార్తీక్ రెడ్డి పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శిస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

మీ అంద‌రితో ప్రార్థ‌న ఒక్క‌టే.. అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు సేవ చేసే భాగ్యం క‌లుగుతుంది. కానీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల త‌ర‌పున కొట్లాడి ప్ర‌జ‌ల గుండెల్లో శాశ్వ‌తంగా స్థానం సంపాదించుకునే అరుదైన అవ‌కాశం ఉంటుంది. ఆ అవ‌కాశం కార్తీక్ రెడ్డికి వ‌చ్చింది. ఎంత గ‌ట్టిగా ప్ర‌జ‌ల్లోకి పోతే.. అంత మేలు జ‌రుగుతుంది. కార్తీక్ రెడ్డి.. మూసీ ప్రాజెక్టు వ‌ల్ల ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నార‌ని తెలిపారు. దాదాపు ఐదారు వంద‌ల కుటుంబాలను క‌లిశాం. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా.. మాకు ఎవ‌రు మేలు చేస్తారో ఎవ‌రు చేయ‌రో అర్థం అవుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 40 ఏండ్ల నుంచి ఇండ్లు క‌ట్టుకున్నాం.. ఇప్పుడేమో క‌బ్జాదారులు అని అంటున్నారు. అన్ని ట్యాక్స్‌లు క‌డుతున్నాం. క‌ట్టంగా కూడా ఇవాళ దొంగ‌లు, ఆక్ర‌మ‌ణ‌దారులు అని బ‌ద్నాం చేస్తున్నార‌ని వారు వాపోయారు. బంగారం లాంటి భూమిని విడిచిపెట్టి పోవాల‌ని కాంగ్రెసోళ్లు బెదిరిస్తున్నారు. కోట్ల ఆస్తి మా పిల్ల‌ల‌కు ఉండిపోత‌ది అనుకుంటే.. ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తాడ‌ని ఊహించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ని కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement