Friday, December 13, 2024

TG కిష‌న్ రెడ్డికి రేవంత్ స‌త్కారం – ఎందుకంటూ కెటిఆర్ నిల‌దీత ..

హైద‌రాబాద్ – ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వ నిన్న సాయంత్రం కిషన్ రెడ్డితో భేటీ అయిన సీఎం రేవంత్ ఆయన్ను సన్మానించిన విషయం తెలిసిందే. ఆ ఫోటోను ఎక్స్‌లో పోస్టు చేసిన కేటీఆర్ సీఎం రేవంత్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎందుకు ఈ సన్మానం? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టనుపో అని చెప్పినందుకా? లేక, అమృత్ స్కాంలో నీ బావమరిదిని కాపాడుతున్నందుకా?, పొంగులేటి ఇంట్లో జరిగిన ఈడీ సోదాల్లో మీ వివరాలు బయటకి రాకుండా ఆపి, కేసులు పెట్టకుండా ఆపినందుకా? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

రవీందర్ గుండెను ఆపింది నీ హైడ్రా బుల్దోజరే!…

మూసీ పరిహ‌హ‌క ప్రాంతంలో నివ‌సిస్తున్న ర‌వీంద‌ర్ ఇంటిని అధికారులు మార్క్ చేయ‌డంతో గుండెపోటుతో ర‌వీంద‌ర్ క‌న్నుమూశాడు.. దీనిపై కెటిఆర్ స్పందిస్తూ, ర‌వీంద్ గుండెను ఆపింది నీ హైడ్రా బుల్డోజ‌రే అంటూ ట్విట్ చేశారు.. గ‌తంలో బుచ్చమ్మ అకాల మరణానికి బాధ్యుడివి నువ్వే! అంటూ రేవంత్ నిల‌దీశారు. ఈ చావుకు కారణం నువ్వు కాదా? నీ హైడ్రా బుల్డోజర్లు కారణం కాదా? ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురింపించారు..

హైడ్రాతో పేదల్లో భయం నింపింది నువ్వు కాదా? పేదల గూడులను కూల్చమన్నది నువ్వు కాదా? అని నిల‌దీశారు. డిపిఆర్ లేదంటూనే ఇళ్ల మీద మార్కింగ్ లు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది నువ్వు కాదా? అని క్వ‌శ్చ‌న్ చేశారు.
అమాయకులను బలితీసుకొని! వారి బ్రతుకులను ఛిద్రం చేసి! వాళ్ళ కుటుంబాలను చిన్నాభిన్నం చేసి, వారి గుండెలను ఆపేసి? ఏం బావుకుంటావ్ రేవంత్..! అని అన్నారు కెటిఆర్

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement