రేవంత్ పై కెటిఆర్ రుసరుసలు
తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్వి సమావేశం
రేవంత్ సర్కార్ పై ప్రజలను చైతన్యం చేయాలని పిలుపు
హైదరాబాద్ – గుంపు మేస్త్రీ అంటే కట్టేతోడు.. ఈ చిట్టినాయుడు కూల్చేటోడు అని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడబోమని, .. ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు అని స్పష్టం చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసమే టీఆర్ఎస్ ఆవిర్భావించింది. 14 ఏండ్లు ఎన్నో ఉద్యమ పోరాటాల్లో విద్యార్థి నాయకులు కథానాయకులగా వ్యవహరించారని గుర్తు చేశారు. కదనరంగంలో విజృంభించి కొట్లాడి ప్రాణత్యాగం చేసిన ప్రతి అమరవీరుడికి పాదాభివందనమని అన్నారు.. పోరాటం మనకు కొత్త కాదని, రాష్ట్రం కోసం 14 ఏండ్ల కొట్లాడామని చెప్పారు. . పెద్ద పెద్ద నాయకులైన రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు వంటి నాయకులతో తలపడి చివరకు తెలంగాణ తెచ్చామని అంటూ . మరి ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు అని అన్నారు..
హైదరాబాద్ చుట్టూ సముద్రం
హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉంది అంటడు రేవంత్ రెడ్డి. ఏ రాయితో నెత్తి పగులగొట్టుకోవాల్నో తెలుస్తలేదు. మొన్న ఓ సారి మాట్లాడుతూ.. మన తెలంగాణలో భాక్రా నంగల్ డ్యామ్ ఉందని చెప్పిండు. రేవంత్ రెడ్డి వల్ల ఇన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రకారం విప్రో సీఈవో సత్య నాదెళ్ల.. ఆయనకు ఏం తెల్వదు.. ఎవడన్న చెప్పబోతే వినడు. పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది రాష్ట్రం పరిస్థితి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక ప్రస్తుత రేవంత్ పాలనపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని విద్యార్ధి నేతలకు కెటిఆర్ పిలుపు ఇచ్చారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా కేసీఆర్ పోరాటం చేశారని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జిల్లాకో మెడికల్ కాలేజీ , జిల్లాకో నర్సింగ్ , గురుకుల పాఠశాలలు 1000 పైచిలుకు లేవని అంటూ ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయన్నారు. . గురుకులాల్లో ఒక్కో విద్యార్థి మీద లక్షా 25 వేలు ఖర్చు పెడుతున్నామని,. ఇవన్నీ మనం సాధించిన విజయాలు అని కేటీఆర్ తెలిపారు