Wednesday, October 2, 2024

TG – అమాన‌వీయంగా కాంగ్రెస్ పాల‌న‌ – రేవంత్ పై కెటిఆర్ ఫైర్

గాంధీజీ స్పూర్తికి రేవంత్ తూట్లు
బాపూజీ బాటే అంద‌రికి మార్గ‌ద‌ర్శ‌కం
గాంధీ,శాస్ర్ర్తీల జ‌యంతి సంద‌ర్భంగా కెటిఆర్ నివాళి

హైద‌రాబాద్ – పోరాట యోధుడిగా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన యోధుడు మహాత్మాగాంధీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్ర పటాలకు కేటీఆర్‌, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. సత్యాగ్రహంతో ప్రపంచాన్ని మేల్కొలిపిన గొప్ప మహనీయుడు కేటీఆర్‌ అని కొనియాడారు. నెల్సన్‌ మండేలా లాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని అన్నారు. మొత్తం విశ్వగురువుగా కీర్తించిన నేత గాంధీ కూడా మార్టిన్ లూథర్ కింగ్‌కు ఆదర్శమ‌ని అన్నారు.

- Advertisement -

అమాన‌వీయంగా కాంగ్రెస్ పాల‌న‌…

కాంగ్రెస్‌ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందని కేటీఆర్‌ అన్నారు. బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని, ఆ సమాజం, ఆ ప్రభుత్వం ఎట్లా ఆదరిస్తున్నదనే దాన్నిబట్టి ఆ ప్రభుత్వం, వ్యవస్థ గొప్పతనం తెలుస్తుందని మహాత్మా గాంధీ స్వయంగా చెప్పారని తెలిపారు. ఈ మాట సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. బాపూజీ స్ఫూర్తికి భిన్నంగా రేవంత్ పాల‌న కొన‌సాగుతున్న‌ద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు కెటిఆర్ .

కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలోని పేదలు బాధపడుతున్నారని అన్నారు. ప్రభుత్వ అమానవీయ పాలనపై ఢిల్లీలోని ప్రస్తుత గాంధీలు స్పందించాలని కోరారు. డీపీఆర్‌ లేకుండా ఇండ్లు కూలగొట్టే ప్రయత్నాలను విరమింపజేయాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై మానవత్వంతో ముందడుగు వేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement