Friday, November 22, 2024

TG – ఆస‌రా దాత‌ల విరాళంతో గుంత‌లు పూడ్చివేత …సిగ్గ‌నిపించ‌డం లేదా రేవంత్

సిగ్గ‌నిపించ‌డం లేదా రేవంత్
గుంత‌లు రిపేర్ కు 200వృద్ధులు విరాళం
శ్ర‌మ‌దానంతో మ‌ర‌మత్తులు
గ్రామాల దుస్థితి దిగ‌జార్చిన ఘ‌నత మీదే
ట్విట్ట‌ర్ వేదిక‌గా రేవంత్ పై కెటిఆర్ విమ‌ర్శ‌లు

హైదరాబాద్‌: ఆసరా పెన్షన్లు వృద్ధులకు సరైన సమయానికి అందక అల్లాడుతుంటే దాచుకున్న డబ్బుతో తప్పని పరిస్థితుల్లో రోడ్లు వేస్తున్నారని చెప్పారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ . ఆసరా పెన్షన్‌తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. ఎందుకు మీ పాలన, కొంచెం కూడా సిగ్గు అనిపిస్త లేదా అని విమర్శించారు.
కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఆసరా పథకం అవ్వా తాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా ఆసరా అవుతున్నదని కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా పోతుగల్‌లో 200 మంది పింఛన్‌ దారులు (వృద్ధులు) రూ.20 చొప్పున రూ.2 వేలు పోగేసి షాద్‌నగర్‌-చేవెళ్ల రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఆసరా పథకం అసరవుతున్నదని ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ అన్నారు. రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవా అని ప్రశ్నించారు. మాజీ సర్పంచుల సంగతి సరే చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు కావల్సిందేనా రేవంత్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, అలాంటి గ్రామాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందని గుర్తుచేశారు. అంతటి గొప్ప కార్యక్రమం పల్లె ప్రగతిని అటకెక్కించారా మహానుభావ అంటూ విమర్శించారు.

ఎప్పుడు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నారు..

ఢిల్లీ నుంచి రాహుల్, ప్రియాంక వచ్చి 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఫుల్ పేజీ ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు ఇచ్చిన విషయాన్ని కెటీఆర్ తాజాగా ఆయ‌న‌ర గుర్తు చేశారు. ఇప్పుడు,300 రోజుల తర్వాత, ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, కార్యకర్త గాని ఆ హామీలు ఎందుకు అమ‌లు చేయ‌లేదో ప్రజలకు సమాధానం చెప్తారా ? అని ప్రశ్నించారు. దీనిపై ఢిల్లీ నుంచి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement