Thursday, November 21, 2024

TG – బిఆర్ఎస్ నేత‌ల హౌజ్ అరెస్ట్ – మండిప‌డ్డ కెటిఆర్

ప్ర‌జా ఆరోగ్యంపై శ్ర‌ద్ధ‌లేని స‌ర్కారు
ఆస్ప‌త్రుల్లో అధ్వాన ప‌రిస్థితులు
వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తోంది
పోలీసు నిర్బంధంలో బీఆర్ఎస్ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ
రాజ‌య్య క‌మిటీని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
అయినా ఆస్ప‌త్రుల‌పై అధ్య‌య‌నం చేసి తీరుతాం
స్ప‌ష్టం చేసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: బీఆర్‌ఎస్‌ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను నిర్బంధించ‌డంపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితి అధ్యయనం చేయడానికి నిపుణులైన డాక్టర్లతో త్రిసభ్య కమిటీ వేశామన్నారు. గాంధీ దవాఖానకు ఆ కమిటీని వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నదని నిలదీశారు. సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ఎంత ప్రయత్నించినా వాస్తవాలను దాచలేరన్నారు. వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకొచ్చే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

- Advertisement -

ఆస్ప‌త్రుల‌పై అధ్య‌య‌నానికి క‌మిటీ..

గాంధీ హాస్పిట‌ల్ సహా రాష్ట్రంలోని దవాఖానల అధ్వాన పరిస్థితిని అధ్యయనం చేసేందుకు నియమించిన బీఆర్‌ఎస్‌ నిజ నిర్ధారణ కమిటీకి కాంగ్రెస్‌ సర్కార్‌ అడ్డంకులు సృష్టిస్తున్నద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో పరిస్థితులను అధ్యయనం చేయకుండా నిర్బంధాలకు పాల్పడుతోంద‌న్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్‌ రాజయ్య నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమ‌వారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీ దవాఖానను సందర్శించాల్సి ఉండ‌గా.. రాజయ్య సహా కమిటీ సభ్యులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. వారి ఇండ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు గాంధీ దవాఖాన వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. హాస్పిటల్‌లోకి వెళ్తున్న ప్రతిఒక్కరిని తనిఖీచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement