హైదరాబాద్ – ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణకు తన వెంట లాయర్‌ను అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో నేటి ఉదయం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ధర్మాసనం ఆయన పిటిషన్‌ను స్వీకరించింది. ఇవాళ మధ్యాహ్నం ఆయన వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కాగా, ఈ కేసులో రేపు ఎసిబి ఎదుట కెటిఆర్ విచారణకు హాజరుకావాలసి ఉంది..
Advertisement
తాజా వార్తలు
Advertisement