Sunday, November 3, 2024

TG – ఇదే రివర్స్ పాలన అంటే

పెన్షన్ డబ్బు తిరిగి ఇవ్వాలంటూ వృద్ధురాలికి ప్రభుత్వం నోటీసు

ఘాటుగా స్పందించిన కేటీఆర్

- Advertisement -

ఆసరా పెన్షన్ దారులకు రేవంత్‌ రెడ్డి సర్కార్‌ నోటీసులు ఇవ్వడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. కొత్తగూడెం జిల్లాలో ఆసరా పెన్షన్లపై ఇటీవల సర్వే నిర్వహించగా దాసరి మల్లమ్మ (80) అనే వృద్ధురాలు ఆసరా పెన్షన్‌కి అనర్హురాలు అని.. ఇప్పటివరకు ఆమె తీసుకున్న రూ. 1,72,928 తిరిగి ప్రభుత్వానికి 7 రోజుల లోగా చెల్లించాలని ఆమెకు నోటీసు ఇచ్చారు. అయితే.. ఈ వివాదంపై కేటీఆర్‌ ఎక్స్ ద్వారా స్పందించారు.

రేవంత్‌ సర్కార్ వింత చేష్టలు మొదలుపెట్టిందని ఆగ్రహించారు. కొత్త పథకాలు ఇస్తామని గతంలో దొంగహామీలు ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు లబ్ధిదారుల సొమ్ము వెనక్కి అడుగుతున్నారని ఆగ్రహించారు. ఇదే రివర్స్ పాలన అంటే ఇదే అంటూ మండి పడ్డారు.

పెన్షన్ తిరిగిఇవ్వాలని వృద్ధురాలికి నోటీసులిచ్చారని ఫైర్‌ అయ్యారు. అడిగితే సాంకేతిక కారణాల వంక చూపిస్తున్నారని నిప్పులు చెరిగారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుందన్నారు. పేదలపై దుర్మార్గపు చర్యలు మానుకోవాలని కోరారు. లేకపోతే ప్రజలే కాంగ్రెస్ సర్కార్‌పై తిరగబడతారని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement