కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం..
పసిడిపంటల నా తెలంగాణ
అద్భుతమైన స్కీములను స్కాములను ప్రచారం చేశారు
కులవృత్తులకు కేసీఆర్ అండగా నిలిచారు
పంటల దిగుబడిలోనే కాదు పశువృద్దిలోనూ బెస్ట్
గణనీయ అభివృద్ధి సాధించామని కేంద్రమే చెబుతోంది
దుర్మార్గపు ప్రచారాలను ఇప్పటికైనా ఆపాలి
ట్విట్టర్ వేదికగా సూచించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:
కేసీఆఆర్ ప్రభుత్వం అమలు చేసిన అద్భుతమైన స్కీములను స్కాములని దుష్ప్రాచారం చేసిన దుర్మార్గులు ఇకనైనా తీరు మార్చుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత పదేండ్లలో తెలంగాణలో వేల కోట్ల అభివృద్ధి జరిగిందని కేంద్రం ప్రకటించిన లెక్కలను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని శనివారం ట్విట్టర్ వేదికగా చురకలంటించారు. కళ్లముందు ఆవిష్కృతమైన ఈ అద్భుతాలను చూసి ఇప్పటికైనా మారాలని అన్నారు. పంటల దిగుబడిలోనే కాదు, పశు సంపదలోనూ గత పదేండ్లు పండగేనని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కులవృత్తులకూ కేసీఆర్ కొండంత అండగా నిలవడంతోనే పశుసంపదలో గణనీయ వృద్ధి సాధించని తెలిపారు. గ్రామీణ తెలంగాణలో ఉపాధి పెంచాలనే తపన, సంపద సృష్టిలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే తాపత్రయం గులాబీ దళపతి కేసీఆర్‌కు ఉందని వెల్లడించారు.
డిమాండ్‌కు తగ్గట్టే స్థానికంగా ఉత్పత్తి..
తెలంగాణలో ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా ఇక్కడే మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు పెంచే ప్రయత్నం చేశామని కేటీఆర్ తెలిపారు. ఇతర రాష్ట్రాలనుంచి ప్రతినిత్యం వచ్చే వందలాది లారీల దిగుబడికి గత పదేండ్లలో కళ్లెంవేశాని చెప్పారు. ప్రతి ఆలోచన వెనక ఒక సుదీర్ఘ అధ్యయనం ఉందని, కేసిఆర్ లక్ష్యం ఆరోగ్య తెలంగాణ నిర్మాణమని స్పష్టం చేశారు. నేడు గొర్లు, చేప పిల్లల పంపిణీని నిలిపేసి కుల వృత్తులను రూపుమాపే కుట్రలు చేస్తున్న పాలకులారా కేంద్రం లెక్కలు చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని ఎక్స్ వేదికగా సూచించారు.