Wednesday, September 18, 2024

TG – మ‌హిళా క‌మిష‌న్ వ‌ద్ద లొల్లి … కెటిఆర్ సీరియస్

విచార‌ణ‌కు హాజ‌రైన కెటిఆర్
గ‌తంలో ఇచ్చిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ‌
య‌ధాలాపంగా చేసిన‌వే… ఇప్ప‌టికే క్ష‌మాప‌ణ చెప్పా
మ‌హిళా క‌మిష‌న్ వ‌ద్ద కూడా రాజ‌కీయాలేనా
వివ‌ర‌ణ ఇచ్చేందుకు వ‌స్తే అడ్డుకుంటారా
త‌న‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ నేత‌ల నినాదాలేంటీ
స‌భ్యులేమో త‌న‌కు రాఖీలు క‌డుతుంటే…
కాంగ్రెస్ కు చెందిన మ‌హిళ‌లు ధ‌ర్నాలా..
క‌మిష‌న్ కార్యాల‌యం వ‌ద్ద ఘ‌ట‌న‌ల‌పై కెటిఆర్ సీరియస్

హైద‌రాబాద్ – వ్యవస్థలను గౌరవించి తాను వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్ వద్దకు వస్తే.. కాంగ్రెస్ నేతలు దానిని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ . కమిషన్ ఎదుటే బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ లీడర్లు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణంపై చేసిన కామెంట్లపై వివరణ ఇచ్చేందుకు శనివారం కమిషన్ ఎదుట హాజరయ్యారు. చైర్ ప‌ర్స‌న్ కు వివ‌ర‌ణ ఇచ్చిన అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ,బిఆర్ఎస్ నేత‌ల‌పైనా, మ‌హిళ‌ల‌పైనా కార్యాల‌యం వ‌ద్ద దాడులు చేయ‌డం రాజకీయాల్లో ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే క్షమాపణ చెప్పినట్లు గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ఇవాళ కమిషన్ ఎదుట కూడా చెప్పానని అన్నారు. బీఆర్ఎస్ నేతలపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

బిఆర్ఎస్,కాంగ్రెస్ ల మ‌ధ్య పోటాపోటీ నినాదాలు

- Advertisement -

అంత‌కు ముందు పార్టీ మహిళా నేతలతో కలిసి హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌ నుంచి బయల్దేరిన కేటీఆర్‌.. ట్యాంక్‌బండ్‌లోని బుద్ధభవన్‌లో ఉన్న మహిళా కమిషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కేటీఆర్‌ను మాత్రమే ఆఫీస్‌లోకి అనుమతించిన పోలీసులు బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు, నాయకులను అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదే స‌మ‌యంలో కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ.. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, నేతలు బుద్ధభవన్‌ మహిళా కమిషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మహిళా లోకాన్ని ఆయన అవమానించారని విమర్శించారు. మహిళలకు కేటీఆర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోటాపోటీ ఆందోళనలతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారాస, కాంగ్రెస్‌ మహిళా నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఒకరినొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వారిని అదుపుచేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.

రాఖీలు క‌ట్టిన మ‌హిళా నేత‌లు..

కాగా , విచార‌ణ‌కు హాజ‌రైన కెటిఆర్ కు మ‌హిళా క‌మిష‌న్ లోని ప‌లువురు స‌భ్యులు ఆయ‌న‌కు రాఖీలు క‌ట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement