Friday, November 22, 2024

TG – విద్యుత్ ఛార్జీల పెంపు వ‌ద్దు – విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లికి బిఆర్ఎస్ విన‌తి

కెటిఆర్ ఆధ్వ‌ర్యంలో బిఆర్ఎస్ బృందం మండ‌లి స‌భ్యుల‌తో భేటి
పెంపు ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకోవాల‌ని కోరుతూ లేఖ

హైద‌రాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఎమ్మెల్యేలు కాలేరు వెంక‌టేశ్, పాడి కౌశిక్ రెడ్డి, కోవా ల‌క్ష్మీ, డాక్ట‌ర్ సంజ‌య్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, గ్యాద‌రి కిశోర్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు నేడు విద్యుత్ నియంత్రణ మండ‌లి కార్యాల‌యానికి వెళ్లి ఈ మేరకు విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

- Advertisement -

విద్యుత్ పంపిణీ సంస్థలు తమ లోటు రూ. 1200 కోట్లు పూడ్చుకోవడానికి కరెంట్ ఛార్జీలు పెంచాలంటూ గ‌తంలో ప్ర‌తిపాదించిన సంగ‌తి తెలిసిందే. ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిరఛార్జీ కిలోవాట్‌కు రూ. 40 పెంచాలంటూ.. అలాగే పరిశ్రమలకు అన్ని ఒకే కేటగిరీ కింద బిల్లు ఇవ్వడానికి ప్రతిపాదించాయి. ప్రభుత్వం గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుండటం.. 299 యూనిట్ల లోపు ఎలాంటి పెంపు లేకపోవడంతో.. 300 యూనిట్లు దాటి వాడే వారికి భారీగా కరెంట్ బిల్లులు పెరగనున్నాయి. అయితే ఈ పెంపును వ్య‌తిరేకిస్తున్న బిఆర్ ఎస్ పార్టీ నేడు లిఖిత‌పూర్వ‌కంగా త‌న అభ్యంత‌రాల‌ను మండ‌లికి అంద‌జేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement