Friday, November 15, 2024

TG – ఆలయాలపై దాడులు .. పోలీసులు ఏం చేస్తున్నారు? రేవంత్ ను నిలదీసిన కిషన్ రెడ్డి

అస‌దుద్దీన్‌ కోస‌మే ప‌ని చేస్తున్నారా?
దాడులపై రేవంత్ నోరు మెద‌ప‌రేం?
శాంతి భ‌ద్ర‌త‌లేమో గాలికి.. రేవంత్ ఏమో ఎన్నికల ప్ర‌చారానికి
కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆగ్ర‌హం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని ఆలయాలపై యథేచ్ఛగా దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికొదిలి సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ఎన్నిక‌ల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ హరితా ప్లాజాలో ఇవాళ ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. అసదుద్దీన్ కోసం మాత్రమే రేవంత్ పోలీసులు పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా హిందువులను రెచ్చగొట్టే విధంగా హైదరాబాద్‌లో దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని ధ్వజమెత్తారు. కలెక్టర్‌పై దాడులు, రైతులపై కేసుల‌తో బ‌తుక‌లు ఆగం అవుతున్నాయ‌ని అన్నారు. తెలంగాణ బతుకులను కేసీఆర్ , రేవంత్ రెడ్డి నడిరోడ్డుపై వదిలేశారని కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement