ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : తెలంగాణ ప్రజల పోరాట ఫలితమే నిజాం నియంతృత్వ పాలనకు విముక్తి లభించిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేశారు. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడారు.తెలంగాణకు విమోచన లభించిన రోజు నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజు అని కిషన్‌రెడ్డి అన్నారు. వేలాదిమంది తెలంగాణ ప్రజలు విరోచితంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. బలిదానాలు, అనేక త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు.
నిజాం రాజకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో పటేల్ పాత్ర సాహోసపెతమైందన్నారు.
నాలుగు ఘట్టాలు ఒకేసారి…లిబరేషన్ డే ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి ఉత్సవాలు, వినాయక శ్యోభా యాత్ర ఉత్సవాలు, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఇలా నాలుగు ప్రధాన ఘట్టాలు ఒకేసారి రావడం సంతోషంగా ఉందని అన్నారు.
మూడేళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తోందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు..