Saturday, November 16, 2024

TG – విక‌సిత్ భార‌త్ వైపు ప‌రుగులు .. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

వచ్చే 25 ఏళ్లు దేశానికి అమృత‌కాలం
మోదీ నాయ‌క‌త్వ‌లో అన్ని విధాల అభివృద్ది
రోజ్ గార్ మేళాలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఉద్ఘాట‌న

హైద‌రాబాద్ – ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో వికసిత్ భారత్ దిశగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి.. రాబోయే 25 ఏళ్లు దేశానికి అమృత కాలమని అన్నారు. హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ భారతీయ విద్యా భవన్ పాఠశాల లో నేడు నిర్వహించిన రోజ్‌గార్ మేళా లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఎంపికైన 155 మందికి నియామక పత్రాలు అందజేశారు.

- Advertisement -

అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో యువతను వినియోగించుకోవడం అవసరం అని అన్నారు. యువ శక్తితో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని అన్నారు. నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరిందని అన్నారు. దాదాపు 75 దేశాలకు ఢిఫెన్స్ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.

దేశంలో శాంతిభద్రతలను అదుపులో లేకపోతే పెట్టుబడులు రావని అంటూ ఇప్పటికే ఉగ్రవాద చర్యలపై ఉక్కుపాదం మోపామని పేర్కొన్నారు. వ్యవసాయ విధానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని అన్నారు. ఎక్కడా విద్యుత్ కొరత అనేది లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, అన్ని రంగాల అభివృద్ధికి సహకరిస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్ర ప‌థ‌కాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా వినియోగించుకోవ‌డం లేద‌ని అన్నారు.. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా కాంగ్రెస్ స‌ర్కార్ అందుకు అవ‌స‌ర‌మైన మ్యాచింగ్ గ్రాంట్ స‌మ‌కూర్చ‌డం లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement