ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బేగంపేటలో నేడు జరిగిన మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. 2027 లోపే భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోందన్నారు. 70 ఏళ్లు దాటిన ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నామని తెలిపారు. 2047 వరకు దేశ అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.
దేశం ఆత్మ నిర్బర భారత్ ఎదగాలంటే మైనింగ్స్ అండ్ మినరల్స్ భాగస్వామ్యం ఉండాలన్నారు. మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలన్నారు. ప్రపంచానికి జింక్ ను అందించింది భారత దేశం అని తెలిపారు. ఇంకా మినిరల్స్ పై ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నామని తెలిపారు. కోల్ అంశంలో ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, దేశానికి కావాల్సినంత కోల్ ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదిగామన్నారు.
మినరల్ విషయంలో మనం స్వయం సమృద్ధిగా ఎదగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మినరల్ అన్వేషణ కోసం సహకారం అందించేందుకు ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. మినరల్ అన్వేషణ కోసం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ-ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో గనుల తవ్వకం లో నూతన ఆవిష్కరణలతో పాటు మైనింగ్ సంబంధిత వర్గాల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం నూతన ఆవిష్కరణలతో వైవిధ్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు.. స్వయం సమృద్ధి ని పెంచడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు.
ఖనిజ క్షేత్రంలో స్వయం సమృద్ధి సాధించడానికి తమ ప్రభుత్వం కృత నిశ్చ్యమతో ఉందని అంటూ మనమంతా సంఘటితంగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. మనందరం కలిసి మోదీ లక్ష్యం ఆత్మ నిర్భర్ భారత్ కలను నిజం చేయడానికి కృషి చేద్దామని పిల్పునిచ్చారు కేంద్ర మంత్రి . .