Monday, November 25, 2024

TG – అస్త‌వ్యస్తంగా డ్రైనేజీ సిస్టం .. చర్యలు తీసుకోవాలని రేవంత్ కు కిషన్ రెడ్డి సూచన


అనేక ప్రాంతాల్లో ఓపెన్ డ్రైనేజీలు
వ‌ర్షం ప‌డితే ఇళ్ల‌లోకే మురుగు నీరు
వ‌ర‌ల్డ్ క్లాస్ సిటీలో దుర్బ‌ర ప‌రిస్థితులు
బ్యూటీఫికేష్ కంటే ముందు దీన్ని బాగుచేయాలి
కావాల్సినన్ని నిధులు విడుద‌ల చేయండి
రేవంత్ స‌ర్కార్ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సూచ‌న

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైద‌రాబాద్ :
చిన్నపాటి వర్షం పడితే డ్రైనేజీ వాటర్ ఇండ్లలోకి రావడంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నార‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంద‌న్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ డివిజన్, ముషీరాబాద్ డివిజన్ లలో కేంద్రమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అనేక బస్తీలు, హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీల్లో ఓపెన్ డ్రైనేజీ ఉంద‌ని, నేటి వ‌ర‌కు ఆయా ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉందని తెలిపారు.

- Advertisement -

ఫండ్స్ రిలీజ్ చేయాలి..

హైదరాబాద్ విషయంలో హైలేవల్ మీటింగ్ ఏర్పాటు చేసి కావాల్సిన నిధులు మంజూరు చేసి నగరాన్ని రక్షించాలని సీఎం రేవంత్‌ను కిష‌న్ రెడ్డి కోరారు.. దురదృష్టవశాత్తు గత కొన్నిరోజులుగా క్రాంటాక్టర్లకు బిల్లులు రావడం లేద‌ని.. మంజూరు అయిన పనులకు టెండర్లను పిలిస్తే క్రాంటాక్లర్లు ముందుకు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అలాగే.. మునిసిప‌ల్ కార్మికులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నార‌న్నారు. ముందు ఈ విష‌యాలు ప‌రిష్క‌రించాల‌ని ముఖ్య‌మంత్రిని కోరారు.

బ్యూటీఫికేష‌న్ కంటే ముందు..

లక్షా యాభై వేల కోట్లతో మూసీ నది బ్యూటిఫికేషన్ చేస్తామని సీఎం రేవంత్ పదే పదే చెప్తున్నార‌ని, అంత‌కుంటే ముందు బస్తీలల్లో డ్రైనేజీ సమస్యను పరిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. అలాగే , హైదరాబాద్‌కు మూసీ బ్యూటిఫికేషన్ అవసరమే.. కానీ పేదవాళ్ల ఇండ్లను తొలగించకూడదని డిమాండ్ చేశారు. పారిశ్రామిక రంగం, ఐటీ, ఫార్మా, డిఫెన్స్, హెల్త్ సెక్టార్, విద్యారంగాల్లో హైదరాబాద్ వేగవంతంగా ముందుకెళ్తుందని, అందుకు అనుగుణంగానే మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement