Friday, November 22, 2024

TG – హైద‌రాబాద్ లో మౌలిక వ‌స‌తులు పెర‌గాలి – కిషన్ రెడ్డి

పెరుగుతున్న న‌గరానికి అనుగుణంగా మార్పు రావాలి
ప్ర‌స్తుత రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ప్రాధాన్యత‌లు వేరే గా ఉన్నాయి
ప్ర‌ధాని మోదీ ‘ఏక్ పేడ్ మాకే నామ్’ పిలుపు
అమ్మ‌పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి
విక‌సిత్ భార‌త్ దిశ‌గా ప్ర‌ధాని మోదీ అడుగులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ పిలుపు మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఇవాళ బీజేపీ నగర కార్యాలయ ఆవ‌ర‌ణ‌లో వారి మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో మొక్కలు నాటుతూ అమ్మను గౌరవించుకోవాలని సూచించారు. ఓవైపు అమ్మకు గౌరవం కల్పిస్తూనే మరోవైపు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు..

- Advertisement -

అనంత‌రం ఆయ‌న బిజెపి కేంద్ర కార్యాల‌యంలో వాసవి బృందావన్ సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడు ఎలాంటి సమయంలో నైనా సమస్యలు తీర్చేందుకు త‌న వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారని, ఆ అప్పులకు మిత్తులు కూడా కట్టలేని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టి వేసార‌న్నారు. కనీస అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్ లకు ఇవ్వడానికి కూడా డబ్బుకు లేవు టెండర్లు ఇవ్వలేక పోతున్నారని వాపోయారు.

మౌలిక వ‌స‌తుల‌పైన దృష్టి పెట్టాలి

తెలంగాణ లో అత్యధిక శాతం ప్రజలు హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. మౌలికమైన వసతుల్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభు త్వం ఉంద‌ని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రాధాన్యతల్ని మార్చుకుంటున్నాయన్నారు. డిఫెనన్స్, ఐటీ, ఫార్మా, హెల్త్, లాంటి ప్రధానమైన రంగాలకు హైదరాబాద్ హబ్ గా ఉంద‌ని అంటూ ఆయా రంగాల‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజల మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వాలకు కృషి చేయాలని తెలిపారు. ఇంట్రెస్ట్రక్చర్ను డెవలప్ చేసిన‌ప్పుడే ప్రజల స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయ‌ని, కానీ ఈ ప్రభుత్వానికి అవేం పట్టడం లేద‌న్నారు విమ‌ర్శించారు.

విక‌సిత్ భార‌త్ దిశ‌గా మోదీ అడుగులు ..

వికసిద్భారత్ లో భాగంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను ఆవిష్కరించాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంద‌న్నారు. పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి చంద్రయాన్ వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా కేంద్రం కట్టుబటి ఉంద‌న్నారు.. కానీ గత ప్రభుత్వం హైదరాబాద్ అంటే హైటెక్ సిటే అనే విదంగా వ్యవహరించింద‌ని విమ‌ర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి హైదరాబాద్ నగరం పై ఒక ప్రణాళికే లేదన్నారు . ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్తగా ఎదిగిన భారత్ త్వరలో మూడో స్థానానికి ఎగబాకనుంది అ దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement