Thursday, December 12, 2024

TG – రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు – నేడు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో కెసిఆర్ భేటి

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో నేడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఒంటగంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ భేటీ కానున్నారు.

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీలో ఎత్తిచూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

హైడ్రా, లగచర్ల ఘటనలపై కూడా ప్రశ్నించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలపై ప్రజల అంచనాలు, నిరసనలు వంటి అంశాలను సభ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర అంశాలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా.. రేపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ ఆవిష్కరణకు రావాలని కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు వెళ్లి స్వయంగా మంత్రి పొంగులేటి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ హాజరుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement