Monday, December 9, 2024

TG – గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ లో ఎమ్మెల్సీ క‌విత – బిఆర్ఎస్ నేత‌ల‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్

హైద‌రాబాద్ – ఎమ్మ‌ల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత హ‌రీశ్ రావుని నేటి ఉద‌యం అరెస్ట్ చేసి గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ కు త‌రలించారు. దీంతో భారీ సంఖ్య‌లో బిఆర్ఎస్ నేత‌లు కార్య‌కర్తలు పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లివ‌చ్చారు.. దీంతో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

ఇది ఇలా ఉంటే మరో వైపు కౌశిక్‌రెడ్డి, హరీశ్‌రావుకు మద్దతు తెలిపేందుకు కౌశిక్ ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజును అడ్డుకున్నారు పోలీసులు . మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డిని సైతం పోలీసులు అరెస్టు చేసి రాయదుర్గం ఠాణాకు త‌ర‌లించారు.. ఇక హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున గచ్చిబౌలి పీఎస్‌కు చేరుకున్నారు. అలాగే బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఠాణాకు వ‌చ్చారు. ఆమెను మాత్రమే ఠాణాలోకి అనుమతించారు. స్టేష‌న్ లో ఉన్న‌హ‌రీశ్ రావునుఆమె ప‌రామ‌ర్శించారు. జ‌రిగిన సంఘ‌ట‌న వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.. ఈ సంద‌ర్భంగా అరెస్ట్ చేసిన బిఆర్ఎస్ నేత‌లంద‌ర్ని విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement