Thursday, December 12, 2024

TG – ఉద్య‌మకారుల‌తో పెట్టుకోవ‌ద్దు – రేవంత్ కు క‌విత వార్నింగ్

హైద‌రాబాద్ – హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకు వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ భవన్ లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతంతో నేడు అభిషేకం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. ఉద్యమకారులతో రేవంత్ రెడ్డి పెట్టుకోవద్దని హెచ్చారించారు. ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడలేదన్నారు. ఉద్యమ కారులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీ గురువు చంద్రబాబును అడుగు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌ పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరు

ప్రపంచంలో అందరూ పూలతో దేవుని పూజిస్తే తెలంగాణలో మాత్రమే పూలను పూజిస్తామన్నారు. యూనిక్ ఐడెంటిటీ గా ఉన్న బతుకమ్మను మాయం చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ నీ మాయం చేసి కాంగ్రెస్ గుర్తు పెట్టారని మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉందన్నారు. జొన్నలు, మక్కలు తమిళనాడు, కర్ణాటకలో పండించరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ అన్నారు. బతుకమ్మకు కాంగ్రెస్ హస్తం గుర్తు పెట్టి ఇదే తెలంగాణ తల్లి అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కారులకు నజరానా ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. మహిళలకు విగ్రహాలు పెట్టి పురుషులకు వరాలు ఇస్తున్నారన్నారు. బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సంధ్య, విమలక్క, ఇతర తెలంగాణ మహిళా మణులకు గుర్తింపు ఏది? అని సీఎంను ప్రశ్నించారు.

- Advertisement -

తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదగానే ఉండాలా అన్ని రేవంత్ ను నిల‌దీశారు క‌విత‌. మీ నోటి నుంచి ఎరుకల నాంచారమ్మ, బీడీ కార్మికుల మహిళల పేరు రాలేదన్నారు. ఉద్యమ కాలంలో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లిని మార్చారని విమర్శించారు. విగ్రహం పెట్టామని చెప్పి సామన్య మహిళలకు ఇచ్చిన హామీలు ఎగ్గొడతారా అని నిలదీశారు. కాంగ్రెస్‌ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఉద్యమ తల్లే మా తల్లి హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలని ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించాలన్నారు. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలు కోరుకున్నారని కవిత అన్నారు. ప్రభుత్వం ప్రజలను భయపెట్టడం సరికాదన్నారు. అయినా మీ ఉడుత ఊపుల‌కు ఎవ‌రు భ‌య‌ప‌డ‌ర‌ని రేవంత్ కు తేల్చి చెప్పారు.

ఆశా వ‌ర్క‌ర్ల‌పై దాడి..
నిన్న ఆశా వర్కర్ల మీద ప్రభుత్వం చేసిన దాష్టికాన్ని ఖండిస్తున్నామన్నారు క‌విత‌. వారికి త‌మ‌ పూర్తి మద్దత్తునిస్తున్నామని తెలిపారు. ఒకవైపు మహిళల పేదలుగా చూడాలనుకుంటున్న రేవంత్ మరోవైపు మహిళలపై దాడులు చేయిస్తున్నారని కవిత మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement