Monday, December 30, 2024

TG – నేడు నిజామాబాద్ లో పర్యటించనున్న కవిత

హైదరాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు కవిత వెళ్తున్నారు.

ఇందల్వాయి టోల్ గేట్ నుంచి నిజామాబాద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. డిచ్‌పల్లి వద్ద కవితకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలుకుతారు. సుభాష్ నగర్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా ఎస్ ఎఫ్ ఎస్ సర్కిల్ వరకు బీఆర్ ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

అనంతరం ఎస్‌ఎఫ్‌ఎస్‌ సర్కిల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి కవిత ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement