Wednesday, December 4, 2024

TG – కెసిఆర్ ఓ వేగు చుక్క – ఎమ్మెల్సీ క‌విత

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొక్క అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి… కేసీఆర్ ఒక వేగుచుక్క అని కొనియాడారు. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని క‌విత ప్రశంసించారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో జ‌గిత్యాల జిల్లా అధ్య‌క్షుడు క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమ‌న్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యి పారేవ‌ని ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని క‌విత విమ‌ర్శించారు.

జాగృతిని యాక్టీవ్ చేస్తున్న క‌విత
ఇక తెలంగాణ జాగృతిని యాక్టీవ్ చేయ‌నున్నారు క‌విత‌.. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నేతలతో ఈ నెల‌ 4 నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు
కవిత షెడ్యూల్:
డిసెంబర్ 4: వరంగల్ , నిజామాబాద్
డిసెంబర్ 5: కరీంనగర్ , నల్గొండ
డిసెంబర్ 6: రంగారెడ్డి , ఆదిలాబాద్
డిసెంబర్ 7: హైదరాబాద్ ,ఖమ్మం
డిసెంబర్ 8: మెదక్.మహబూబ్‌నగర్

Advertisement

తాజా వార్తలు

Advertisement