Monday, January 6, 2025

TG – ప్రజలను వదిలి.. పైసల కోసం వెళ్లినోడు నాయకుడా? సంజయ్ పై కవిత ఫైర్

జగిత్యాల ఆంధ్రప్రభ , కేసీఆర్ బొమ్మతో గెలిచిన ఏ మొహంపెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో వెళ్లావంటూ ఎంఎల్ఏ సంజయ్ కుమార్ ను బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత నిలదీశారు.

నేడు జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ కవిత పర్యటించారు. ఈ క్రమంలో ధరూర్‌ బైపాస్‌ వద్ద గజమాలతో పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తరలివచ్చారు. బైపాస్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. నియోజకర్గ అభివృద్ధికి ఏడాది నుంచి ఒక్క రూపాయి సైతం తేలేదని ఆరోపించారు. అయినా ఎందుకు పార్టీ వీడి వెళ్లావంటూ జగిత్యాల ఎమ్మెల్యేను ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రజలను వదిలి.. పైసల కోసం వెళ్లినోడు నాయకుడా? అంటూ సంజయ్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తట్టేడు మట్టి తీయ్యలేదు.. అసెంబ్లీకి ఏ మొహం పెట్టుకుని పోతావంటూ సంజయ్‌పై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంపై మహిళలు మండిపడుతున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ₹2500 ఇస్తామన్న హామీ ఏమైందని రేవంత్‌ సర్కార్‌ను నిలదీశారు. కాగా , ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన బి ఆర్ ఎస్ నేతలు , కార్యకర్తలను చూసి జగు త్యాల అంటేనే బీఆర్‌ఎస్‌ అడ్డా అని మీ అందర్నీ చూస్తే తెలిసిపోతుందన్నారు కవిత.

Advertisement

తాజా వార్తలు

Advertisement