హైదరాబాద్ – అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా నేడు జన జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యాలయంలో కవిత ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో కులవివక్ష, అసమానతలు రూపుమాపడానికి అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త,మహిళా విద్యను ప్రోత్సహించిన మార్గదర్శి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పరితపించిన వ్యక్తి మహాత్మ జ్యోతి రావు పూలే అని కొనియాడారు. ఇదే సందర్భంగా అసెంబ్లీ అవరణలో ఆ మహానీయడి విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ ను కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement