Saturday, November 23, 2024

TG – మీ పాల‌న‌లో విద్యా కుసుమాలూ రాలిపోతున్నాయి … రేవంత్ ను నిల‌దీసిన క‌విత

హైద‌రాబాద్ – రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలల పరిస్థితిపై సమీక్షించాలని ఎమ్మెల్సీ కవి డిమాండ్‌ చేశారు. కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ, ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి కనీసం 10 నిమిషాలైనా సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. వెంటిలేటర్ పై ఉన్న విద్యార్థిని పరామర్శించడం బాధాకారంగా ఉందన్నారు. ఫుడ్ పాయిజన్ , కరెంట్ షాక్‌తో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల పాలనలో 42 మంది విద్యార్థులు మృతి చెందడం దారుణమని ఆమె మండిపడ్డారు. ఏకంగా 42 మంది విద్యార్థులు మృత్యువాత పడితే ఈ ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యమని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement