కడెం. సెప్టెంబర్ 2 ప్రభా న్యూస్ నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా కడం జలాశయంలో ఇన్ ఫ్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల మూలంగా జలాశయంలో ఒక లక్ష 31వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరింది.. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం 700 అడుగులకు దాటింది.. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై సోమవారం తెల్లవారుజాము న ప్రాజెక్టుకు చెందిన 18 వరద గేట్ లు ఎత్తివేసి రెండు లక్షల 19 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
ప్రస్తుతం కడం ప్రాజెక్ట్ జలాశయంలో 51వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ నీటిమట్టం 691.500 అడుగులకు ఉందని కడెం ప్రాజెక్టు ఈ ఈ రాథోడ్ విట్టల్ పేర్కొన్నారు . కాగా నేటి ఉదయం కడెం జలాశయంలో ఇన్ ఫ్లో వరద నీరు రావడం కొద్ది మేర తగ్గడంతో ఎత్తిన 18 వరద గేట్లలో 8 వరద గేట్లు మూసివేసి మరో 10 గేట్ల వరదగేట్ల ద్వారా 84 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల కావడం జరుగుతుందన్నారు . ప్రాజెక్టు పరిహవాక గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని రాథోడ్ విట్టల్ కోరారు.