హైదరాబాద్ – సద్దాం హుస్సేన్ , గడాఫీ లా డిక్టేటర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారిపోయారంటూ ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సంవత్సరం కాలం పాలనలో ఎప్పుడూ గొడవలే జరిగాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన రైతులతో గొడవ, బేడీలు వేయించారని, సర్పంచులు నిరసన తెలుపుతానికి వస్తే వారిని అరెస్టు చేయించారని, నిరుద్యోగులు ఉద్యోగాలు ఏవి అని అడిగితే వారిని కూడా వదలలేదని చెప్పారు.
నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమంటే కోరితే వారి మీద లాఠీ ఛార్జ్ చేయించారని కేఏ పాల్ గుర్తు చేశారు. సద్దామ్ హుస్సేన్ లాగా అలాగే రాత్రికి రాత్రే ఓ కొత్త చట్టాన్ని తెచ్చి హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యలలో ఇళ్లను నోటీసులు కూడా ఇవ్వకుండా కూలగొడుతున్నారని మండిపడ్డారు. నోటీసులు ఇచ్చిన తన సోదరుడి ఇంటిని మాత్రం కూల్చకుండా కాపాడుకొస్తున్నారని కేఏ పాల్ ఫైర్ అయ్యారు.