గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడం విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసింది.. విచారణలో భాగంగా నేడు ట్రాన్స్ కో, జెన్ కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, గత ప్రభుత్వంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన అరవింద్‌కుమార్ హాజరయ్యారు.
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, ఇతర అంశాలపై ప్రభాకర్ రావు, అరవింద్ నుంచి జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ వివరాలు సేకరించారు. కాగా రాష్ట్రప్రభుత్వానికి వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేందుకు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణను వేగవంతం చేసింది. విద్యుత్ అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజనిర్ధారణ కోసం ఇప్పపటికే బహిరంగ ప్రకటన జారీ చేసి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. పవర్ ప్రాజెక్ట్ ల ఒప్పందాలు, కొత్త విద్యుత్ ప్రాంట్ ల నిర్మాణాలపూ అవగాహన కలిగిన వ్యక్తులు, విద్యుత్ రంగ నిపుణులు, సంస్థల నుంచి సూచనలు కమిషన్ స్వీకరించింది.