Sunday, November 17, 2024

TG – భవిష్యత్‌లో కొలువుల జాత‌రే

మరిన్ని ఉద్యోగ నోటిఫికేష‌న్లు వేస్తాం..

ఉద్యోగాలిప్పిస్తామంటే ఎవ‌రినీ న‌మ్మొద్దు- మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంచలన ప్రకటన చేశారు. ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే న‌మ్మొద్ద‌న్నారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని వివరించారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 11 నెలల్లోనే 7 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేశామన్నారు. మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 732 ఫార్మాసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టులు, 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, 45 అసిస్టెంట్ ప్రొఫెసర్‌(ఎంఎన్‌జే), 24 ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.

- Advertisement -

భవిష్యత్తులో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. విద్యార్హతలు, రాతపరీక్షలు ఇతర నిబంధనల మేరకే పారదర్శకంగా పైన చెప్పిన పోస్టుల భర్తీ జరుగుతుందని మంత్రి స్ఫష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement