విద్యుత్ స్కామ్ లో కెసిఆర్ జైలు కెళ్లడం ఖాయం
హారీశ్ వల్లే తెలంగాణ దివాళా
ఖజనాలో పైసా లేకుండా చేసిన మీరు
హామీలను వెంటనే అమలచేయమని అడగడమా…
తాము ఇచ్చిన హామీల అమలుకు ఐదేళ్ల గడువు ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు బయటకీ వస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఈ విద్యుత్ స్కామ్ ను డైవర్ట్ చేసే పనిలో పడ్డారన్నారు. పైసా పెట్టుబడి లేకుండా విద్యుత్ అందించే ప్రక్రియ కేంద్రం చేస్తే దాన్ని కాదని కేసీఆర్ యాదాద్రి పవర్ ప్లాంట్ మొదలుపెట్టారన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూడు రూపాయలకు యూనిట్ వచ్చే కరెంట్ వదిలి.. 6 రూపాయలకు కొంటారా..? అని ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తి కోసమే పవర్ ప్లాంట్ అని మండిపడ్డారు. నామినేషన్ మీద యాదాద్రి పనులు ఎందుకు అప్పగించారు? అని అడిగారు.
టెండర్ లు ఎందుకు పిలువలేదు….
విద్యుత్ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ఎందుకు పిలవలేదని కేసిఆర్ ను ప్రశ్నించారు జీవన్ రెడ్డి.ఇక . హరీష్ రావు.. అవినీతి చర్చ పక్కదారి పట్టించే పనిలో ఉన్నారన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అవినీతి కేసీఆర్ మెడకు చుట్టుకోబోతుందన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వల్లనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళ తీసిందని మండిపడ్డారు. ఆర్థిక శాఖ లూటీ చేసింది మీరే కదా? అంటూ హరీష్ రావుపై మండిపడ్డారు. మీరూ లూటీ చేసి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారో చేయండి అన్నట్టు ఉంది హరీష్ వ్యవహారం అని నిప్పులు చెరిగారు. ఆర్థిక స్థితి గతులు చక్కబెట్టే పనిలో ఉన్నారు సీఎం అన్నారు. తాము ఇచ్చిన హామీల అమలుకు ఐదేళ్ల గడువు ఉందని క్లారిటీ ఇచ్చారు… హామీలు అమలనకు ఇంకా సమయం ఉన్నా బిఆర్ ఎస్ నేతలు హామీలు అమలు చేయలేదంటూ రంకెలేయడం తగదన్నారు జీవన్ రెడ్డి .