హైదరాబాద్ – బీఆర్‌ఎస్ పార్టీ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం, శ్రీనివాస రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యతం రద్దు కావాల్సి ఉందన్నారు. నిన్నటి నుంచి స్పీకర్ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని, తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, తమకున్న ఇతర మార్గాల ద్వారా ఒకటి స్పీడ్ పోస్టు, ఇంకోటి ఈ మెయిల్ ద్వారా ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశామన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కానీ ఇవాళ్నేమో సిగ్గు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పుతున్నారని జగదేశ్ రెడ్డి దుయ్యబట్టారు.. పాంచ్ న్యాయ్‌లో భాగంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టిన పార్టీయే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయొద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే చెప్తున్నారని ఆయన వెల్లడించారు. తమ హయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్ దగ్గరకు వచ్చి కండువాలు కప్పుకున్నారన్నారు. చట్టం ప్రకారం 2\3 వంతు మా పార్టీలో జాయిన్ అయ్యారని పేర్కొన్నారు.