హైదరాబాద్: ఎసిబికి మరో అవినీతి అనకొండ చిక్కింది.. చిన్న చేప అనుకుని సోదాలు చేస్తే ఏకంగా దిమ్మ తిరిగేలా రూ .300 కోట్ల ఆక్రమ ఆస్తులు సంపాదించినట్లు వెల్లడైంది.. వివరాలలోకి వెళితే ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయనే అరోపణపై హైదరాబాద్ లోని నీటిపారుదల శాఖ ఏఈఈ గా పని చేస్తున్న నిఖేశ్ కుమార్ నివాసంలో నేటి ఉదయం ఏసీబీ సోదాలు చేపట్టారు. ఉదయం 6గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక నిఖేశ్ బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో కలిపి మొత్తం 30 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఫాంహౌస్లతో పాటు భారీగా వ్యవసాయ భూములు, భవనాలు ఉన్నట్టు గుర్తించారు. కేజీల కొద్దీ బంగారం నివాసం బయట పడింది. ఇప్పటి వరకు గుర్తించిన ఏఈఈ ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం… దాదాపు రూ.300 కోట్లకు పైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక గండిపేట బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో నిబంధనకు విరుద్ధంగా నికేష్ కుమార్ అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ గుర్తించింది. ఇదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, రాజేంద్రనగర్ పరిధిలో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఇక, నికేష్ పేరిట మూడు ఇల్లులు ఉండగా.. ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. ఫామ్ హౌస్‌ల విలువ రూ.80 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉండగా.. నికేష్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ నికేష్ ఏసీబీకి దొరికారు. ఈ కేసులో సస్పెండ్ అయిన ప్రస్తుతం ఇంటిలోనే ఉంటున్నారు.. అయితే అయన ఇంటిలో ఉన్నప్పటికీ పలు ఫిర్యాదులు రావడంతో తాజాగా ఆయన నివాసంపైనా, అతడి బంధువులు, స్నేహితుల ఇళ్లపైనా ఏకంకాలంలో నేడు దాడులు నిర్వహించారు.. ఈ సోదాల వివరాలను నేడు గానీ, రేపు గాని అందిస్తామని ఎసిబి అధికారులు చెప్పారు.