Monday, January 27, 2025

TG – మ‌హిళ‌ల‌కు ఆదాయ వ‌న‌రుగా ఇందిర‌మ్మ డెయిరీ – ఉప‌ ముఖ్య‌మంత్రి భ‌ట్టి

పాడి ప‌రిశ్ర‌మ‌తో స్వ‌యం సంపాద‌న‌
ఆర్థికంగా మ‌హిళ‌లు ప‌డేందుకు డెయిరీ ఏర్పాటు
కెసిఆర్ ప్ర‌భుత్వంలో డెయిరీలు నిర్ల‌క్ష్యం
మ‌హిళ ఆర్థిక వ‌న‌రుల‌ను దెబ్బ తీసిన బిఆర్ఎస్
ఇందిర డెయిరీతో ఏడాదికి రూ.24 కోట్లు మ‌హిళ‌ల‌కు ఆదాయం
ఇందిరా డెయిరీ లోగో ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి వెల్ల‌డి

మ‌ధిర – మహిళా డెయిరీలో పాల విక్రయాలు, వెన్న పాల ఉత్పత్తి ద్వారా స్వయం సమృద్ధి జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహిళా డెయిరీపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మహిళలకు రుణాల పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. మహిళల పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.

- Advertisement -

ఖమ్మం జిల్లా మధిరలో నేడు ఇందిరా డెయిరీ లోగో ను ఆయ‌న ఆవిష్కరించారు. అనంత‌రం మాట్లాడుతూ, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా డెయిరీని రూపొందించామని చెప్పారు. మహిళా డెయిరీపై బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని పేర్కొన్నారు.

డెయిరీ పట్ల కెసిఆర్ ప్ర‌భుత్వం వ్యవహరించిన వైఖరి సరైనది కాదన్నారు. మహిళా డెయిరీలో 61 వేల మంది సభ్యులతో 40 లక్షల డిపాజిట్స్ ఉన్నాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే మహిళ డెయిరీపై దృష్టి సారించామన్నారు. మధిర నియోజకవర్గంలో రెండున్నర లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఏడాదిలో మహిళల ఆదాయం నెలకి 24 కోట్లు రూపాయలు పాల మీదనే సంపాదించవచ్చన్నారు. పాల ఉత్పత్తులన్నింటిని కలిపితే 500 కోట్లు సంపాదించవచ్చని పేర్కొన్నారు. ఇందిరా డెయిరీ ద్వారా దేశం మొత్తం మధిర వైపే చూడాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement