Friday, October 18, 2024

TG: నర్సన్న సన్నిధిలో..సినీన‌టుడు సుమ‌న్‌..


ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు
ఉద్యమ నేత చరిత్రలో నిలిచిపోతారు
తెలంగాణ గర్వించేలా టెంపుల్​ నిర్మాణం
కేసీఆర్​ సేవలను కొనియాడిన సుమన్​

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, యాద‌గిరిగుట్ట :
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామిని సినీ నటుడు సుమన్ గురువారం దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం సుమన్​కు అర్చక పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంత‌రం ప్ర‌సాదం అంద‌జేశారు.

మాజీ సీఎం కేసీఆర్ అద్భ‌తంగా తీర్చిదిద్దారు : సుమ‌న్‌

యాదగిరి గుట్ట ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ మహాద్భుతంగా తీర్చిదిద్దారని సినీ న‌టుడు సుమ‌న్ అన్నారు. పునర్నిర్మాణానికి ముందు ఈ ఆలయం ఎలా ఉండేదో త‌న‌కు తెలుసని, కేసీఆర్ ఎన్నో వ్యయ ప్రయాసలతో ఆలయాన్ని చాలా అందంగా అద్భుత శిల్పకళతో నిర్మించార‌ని కొనియాడారు. ఎంతో మంది శిల్పులు పనిచేసి, అద్భుత శిల్పాలను, గోపురాలను చెక్కారని, గుడిలోపలికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement