Tuesday, December 3, 2024

TG – ఏడాది పాలనలో అద్భుత విజయాలు సాధించాం.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

  • ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతాం..
  • సీఎం సభను విజయవంతం చేయాలి..
  • ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు

పెద్దపల్లి, డిసెంబర్‌ 3 (ఆంధ్రప్రభ): కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది కాలంగా అద్భుత విజయాలు సాధించామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. పెద్దపల్లిలో స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు, విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రామగుండం మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌తో కలిసి పెద్దపల్లిలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పెద్దపల్లిలో రేపు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొననున్నారని తెలిపారు. యువశక్తి విజయోత్సవ సభకు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు.

పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణంపై సీఎం స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలిపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌ బైపాస్‌ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, జిల్లా కేంద్రంలో మహిళా శక్తి ప్రాంగణం, జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. పెద్దపల్లి ఆర్టీసీ బస్‌ డిపోతోపాటు ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, రోడ్లు, వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వివరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement