Monday, September 16, 2024

TG – ఆక్రమణలైతే విద్యాసంస్థ‌లైనా కూల్చివేస్తాం… రేవంత్ స్పష్టం…

తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి
జన్వాడ ఫామ్ హౌస్ కు అనుమ‌తుల్లేవు.
క‌బ్జాకోరులు ఎంత‌టి వారైనా వ‌దిలేది లేదు
ముందుగా మా పార్టీ స‌భ్యుడి ఇంటినే కూల్చాం
అది మా నిబంద‌త‌..

హైద‌రాబాద్ – విద్యాసంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోబోమని, ఎఫ్ఎఎల్, బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సచివాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ, ‘హైడ్రా’ హైదరాబాద్ వరకే పరిమితమని న్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, పార్కులు, నాలల కబ్జాలే మా మొదటి ప్రాధాన్యం అన్నారు. ప్రజా ప్రయోజనాలు మాకు ముఖ్యమని తెలిపారు. చెరువులు కబ్జా చేసిన ఎవర్ని వదిలి పెట్టమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామ పంచాయతీ లు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయన్నారు. జంట జలాశయాలను పరిరక్షించడమే మా భాద్యత అన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నా కుటుంబ సభ్యులు, బంధువు లు ఉంటే వివరాలు ఇవ్వండి నేనే వచ్చి దగ్గర ఉండి కూల్చివేస్తా అన్నారు.

- Advertisement -

కేటీఆర్ ఫామ్ హౌజ్ లీజ్ తీసుకున్న విషయం ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా? అని ప్రశ్నించారు. చూపించకుంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేటీఆర్ స్నేహితుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఫామ్ హౌజ్ కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీస్ కేటీఆర్ ఎలా తీసుకుంటాడన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు. మొదటగా మా పార్టీకి చెందిన పళ్ళం రాజు ఫామ్ హౌజ్ కూల్చిందన్నారు. చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దు. వ్యవసాయం చేసుకుంటే ఇబ్బంది లేదని తెలిపారు.

హ‌రీశ్, రేవంత్ లు ఇంటింటికి వెళ్లండి..

రైతు రుణమాఫీ 2 లక్షల పైన రుణం తీసుకున్న వారు పై మొత్తానికి కడితే రుణమాఫీ అయిపోతుందన్నారు. వాటికి నిధులు కూడా విడుదల చేశామన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి రుణమాఫీ కానీ వారి లెక్కలు సేకరించి కలెక్టర్ ఇవ్వండని తెలిపారు. హరీష్ రావు, కేటీఆర్ ప్రతి రైతు వద్దకి వెళ్ళండి అన్నారు. రుణమాఫీ అవ్వని లెక్కలు సేకరించి కలెక్టర్ కు ఇవ్వండి తెలిపారు. నాకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రుణమాఫీ విషయంలో సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయకుండా ఉన్నాడు.. హరీష్ రావు దొంగ అని ముందే తెలుసన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ చేయాలని విదేశీ పర్యటనలో ఉన్నా మధ్యంతరంగా వచ్చి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసా అన్నారు రేవంత్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement