తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 5, 6 తేదీల్లో జరిగిన ఐసెట్-2024 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని కాకతీయ యూనివర్సిటీ నేడు జూన్ 8న విడుదల చేసింది. ఆన్సర్ కీతో పాటు పరీక్ష ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
రెస్పాన్స్ షీట్లను పొందడానికి అభ్యర్థుల తమ ఐసెటట్ రిజిస్ట్రేషన్ నెమరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి డౌనలోడ్ చేసుకోవచ్చు. ఇక అభ్యంతరాలు నమోదుచేసేందుకు ఐసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. ప్రాథమిక కీపై జూన్ 9 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఫైనల్ కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు.