Friday, October 18, 2024

TG :ఆయ‌న‌ను ఎలా నియ‌మిస్తారు? నిలదీసిన హరీష్​ రావు

శాస‌న మండ‌లి చీఫ్ విప్‌గా మ‌హేందర్ రెడ్డి స‌రికాదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిపాటు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాజ్యాంగ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతోంద‌ని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. పీఏసీ చైర్మ‌న్ విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇలాగే వ్య‌వ‌హరించింద‌ని విమ‌ర్శించారు.

- Advertisement -

మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం
శాస‌న‌మండ‌లి చీఫ్ విప్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డిని నియ‌మించ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని హ‌రీశ్‌రావు అన్నారు. మ‌హేంద‌ర్ రెడ్డిని ఎలా నియ‌మిస్తార‌ని ప్ర‌శ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘ‌న జ‌రుగుతోంద‌ని చెప్పేందుకు ఇదొక ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీకి చీఫ్ విప్ ఎలా ఇచ్చారు?
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డికి చీఫ్ విప్ ప‌ద‌వి ఎలా ఇచ్చార‌ని, ఆయ‌నపై చైర్మ‌న్ వ‌ద్ద ఇప్ప‌టికే అన‌ర్హ‌త పిటిష‌న్ పెండింగ్‌లో ఉంది హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. చైర్మ‌న్ ఇచ్చిన బులెటిన్(మండ‌లి చీఫ్ విప్‌గా నియ‌మించ‌డం) అన‌ర్హ‌త పిటిష‌న్‌కు మ‌రింత బ‌లం చేకూర్చింద‌న్నారు. దీన్ని కూడా అన‌ర్హ‌త పిటిష‌న్‌లో సాక్ష్యంగా చేరుస్తామ‌ని,

గ‌వ‌ర్న‌ర్‌ను త‌ప్ప‌దోవ ప‌ట్టించిన వైనం
ఎమ్మెల్సీ హోదాలోనే పంద్రాగ‌స్టున మ‌హేంద‌ర్ రెడ్డి జాతీయ జెండా ఎగుర‌వేశార‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. మార్చి 15 నుంచే ప్ర‌భుత్వ చీఫ్ విప్ అని బులెటిన్ ఇచ్చార‌న్నారు. దీనిపై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి లేఖ రాస్తామ‌ని చెప్పారు. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌తో పాటు డీవోపీటీకి కూడా లేఖ రాస్తామ‌న్నారు. గ‌వ‌ర్న‌ర్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement