Tuesday, January 28, 2025

TG | సూర్యాపేట‌లో ప‌రువు హ‌త్య …

సూర్యాపేటలో మరో పరువు హత్య జరిగింది. సూర్యాపేటలోని మామిళ్లగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసీ నది కట్టపై వడ్లకొండ కృష్ణ (మాల బంటి) దారుణ హత్యకు గురయ్యాడు. ఆ యువకుడిని బండరాళ్లతో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు కృష్ణ. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రేమ వివాహం చేసుకోవ‌డం వ‌ల్లే హ‌త్య గురయ్యాడనే వాద‌న వినిపిస్తున్న‌ది.. ఇదే స‌మ‌యంలో పాత కక్షలే హత్యకు దారి తీసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement