హైదరాబాద్ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం -2024 బ్రోచర్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సెక్రటేరియట్ లోని నేడు తన కార్యాలయంలో ఆవిష్కరించారు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మానసిక ఆరోగ్య సదస్సులు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అక్టోబరు పది నుండి వారం రోజుల పాటు తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ మరియు సండోజి హెల్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారిని మానసికంగా చైతన్య పరిచేందుకు తలపెట్టిన మానసిక ఆరోగ్య అవగాహన సదస్సు లకు సంబంధించిన పూర్తి వివరాలతో తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ.కరీం, డాక్టర్ ఏ.రాకేష్ కుమార్ మరియు డాక్టర్ కృష్ణగోపాల్ బండారి సంయుక్తంగా మానసిక ఆరోగ్య బ్రోచర్ ను రూపొందించారు. .
ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య సూచనల మేరకు ప్రతి సంవత్సరం అక్టోబర్ పదిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని గ్లోబల్ క్యాంపెయిన్ లో భాగంగా నిర్వహిస్తారు. ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య సూచించిన అధికారిక థీమ్ ప్రకారము
‘పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది సమయం’ అనే అంశంపై మానసిక రుగ్మతలను నివారించేందుకు తక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తు పని-సంబంధిత ఒత్తిళ్ల కారణంగా ఎక్కువ మంది వ్యక్తులు ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశను అనుభవిస్తున్నందున వారిలో మానసిక ప్రశాంతత క్షీణిస్తున్నది. మానసిక ఆరోగ్యం పట్ల అందరికీ అవగాహన తప్పనిసరని, ప్రశాంతమైన జీవన విధానాన్ని వయసుతో సంబంధం లేకుండా అందరూ అమలు చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ.కరీం సమయ సూచిక తోపాటు వారోత్సవాల సందర్భంగా నిర్వహించే వివరాలు తెలిపారు.
ఈ నెల పదవ తేదిన పిల్లలకు, పదకొండున టీనేజ్ వారికి, పన్నెండున యువతీ యువకులకు, పదమూడో తేదీన బాలికలు , స్త్రీలకు, పదునాల్గో తేదిన విద్యార్థులు , నిరుద్యోగులకు, పదిహేనో తేదిన తల్లిదండ్రులకు వారోత్సవాల ముగింపు రోజు పదహారో తేదిన వయోవృద్ధుల కొరకు విడివిడిగా మానసిక ఆరోగ్య ఉపయోగాలు మరియు మానసిక ఆరోగ్య అవగాహన సదస్సు లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు ఉచిత కన్సల్టేషన్ మరియు కౌన్సెలింగ్ సేవల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 9440488571 లేదా 04035717915 నెంబర్లపై సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మానసిక నిపుణులు పాల్గొన్నారు.