Sunday, November 24, 2024

TG – ఆశ్రమ విద్యార్థుల అస్వస్థతకు ప్రభుత్వానిదే బాధ్యత – హరీశ్ రావు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 60 మంది విద్యార్థుల అస్వస్థతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీశ్ రావు పేర్కొన్నారు. వాంకిడి ఘటనను ట్వీట్ చేసిన హరీశ్ రావు ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతుందని మండిపడ్డారు.

సోకాల్డ్ ప్రజా పాలనలో అభం శుభం తెలియని పిల్లల భవిష్యత్తు ఆందోళనకరమవుతున్నదన్నారు. వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థత గురైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు.

మెరుగైన వైద్యం అందించ‌ని ప్ర‌భుత్వంస్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో విడతల వారీగా విద్యార్థులను చేర్చి చేతులు దులుపుకుంటున్నార‌ని హ‌రీశ్‌రావు అన్నారు. బాధిత విద్యార్థుల‌కు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు.

- Advertisement -

వెంటిలేటర్ మీదకు చేరిన ఆ విద్యార్థిని పరిస్థితికి ఎవరు బాధ్యులని ప్ర‌శ్నించారు. సకాలంలో వైద్యం అందించడంలో ఎందుకు విఫలమ‌య్యారని ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉందని, రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలిపే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement