Sunday, September 15, 2024

TG – ఆమెకు అండ‌గా ఉంటాం …… బాధిత మ‌హిళ‌కు బిఆర్ఎస్ భ‌రోసా

న్యాయ జ‌రిగే వ‌ర‌కు పోరాడతాం
జైనూర్ బాధిత మ‌హిళ‌కు బిఆర్ఎస్ భ‌రోసా
గాంధీ హాస్ప‌ట‌ల్లో బాదితురాలికి పరామ‌ర్శ‌
రేవంత్ ప్ర‌భుత్వంలో మ‌హిళ ర‌క్ష‌ణ లేదంటూ హ‌రీశ్ మండిపాటు
రాష్టంలో రోజుకి రెండు హ‌త్య‌లు, నాలుగు భంగాలు
అయినా రేవంత్ లో చ‌ల‌నం లేదంటూ విమ‌ర్శ‌
విప‌క్షాల‌ను అరెస్ట్ ల‌పై పైనే ఆయ‌న దృష్టి
శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడటంలో మాత్రం రేవంత్ వైఫ‌ల్యం ..

హైద‌రాబాద్ – కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై నిందితుడిని కఠినంగా శిక్షించాల‌ని బాధిత కుటుంబీకులు గ‌త కొన్ని రోజులుగా ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు.. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి , తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ త‌దిత‌రులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు ఆదివాసి బిడ్డను నేడు పరామర్శించారు.. బాధిత కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.. బాధితురాల‌కి అన్ని విధాల అండ‌గా ఉండ‌ట‌మే కాకుండా న్యాయం జ‌రిగే వ‌ర‌కూ తాము పోరాటం చేస్తామ‌ని బిఆర్ ఎస్ నేత‌లు హామీ ఇచ్చారు.

కాగా, ఈ సంద‌ర్బంగా తన తల్లిపై జరిగిన అఘాయిత్యంపై బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ, రాఖీ కట్టేందుకు తన తల్లి ఆటోలో వెళ్తుంటే అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి దాడి చేశారని వివరించాడు. హత్యాచార యత్నం చేయడంతో, తన తల్లి ప్రతిఘటించిందని.. దీంతో ఆమెకు గాయాలు అయ్యాయని తెలిపాడు.

- Advertisement -

అనంత‌రం హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ,

రాష్ట్రంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. తొమ్మిది నెలల కాంగ్రెస్‌ పాలనలో మహిళలపై 1900 లైంగికదాడులు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి వద్దే హోం శాఖ ఉన్నప్పటికీ.. ప్రతి రోజూ 2 హత్యలు, 4 మానభంగాలు అన్నట్టుగా పరిస్థితి తయారయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మహిళలకు భద్రత కరువైందన్నారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మహిళల రక్షణకు షీ టీమ్స్‌ ఏర్పాటు చేశామన్నారు.

కెసిఆర్ పాల‌న‌లోనే శాంతిభ‌ద్ర‌త‌లు ప‌టిష్టం..

గత పదేండ్లు తెలంగాణను కేసీఆర్‌ అద్భుతంగా పరిపాలించారు. శాతిభద్రతలను పటిష్టంగా అమలు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారుతున్నదని చెప్పారు. స్మగుల్డ్‌ వెపన్స్‌ బయటపడుతున్నాయ‌న్నారు. ఒకప్పుడు బీహార్‌లో ఉండే నాటు తుపాకులు.. తెలంగాణలో రాజ్యమేలుతున్నాయ‌ని వివ‌రించారు.

కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని రాష్ట్రంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. పోలీసులను ప్రభుత్వం పనిచేయనీయట్లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఫేక్‌ ఎన్‌కౌంటర్లు చేస్తున్నదని ఆరోపించారు హ‌రీశ్ రావు..

వ‌ర‌ద విప‌త్తు సాయంలోనూ వైఫ‌ల్య‌మే .

వరద విపత్తు సహాయం అందించడంలో, లా అండ్ ఆర్డర్, రుణమాఫీ, విద్యా వ్యవస్థను నడిపించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. మొత్తానికి ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ఫెయిల్ అయ్యార‌ని విమర్శించారు. ఎంత సేపూ ప్రతిపక్షాలను వేధించడం, అక్రమ కేసులు పెట్టడం తప్ప పాలనను గాలికి వదిలేశార‌న్నారు. మహిళను పరామర్శించడానికి సీఎం రేవంత్‌కు సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు.

మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ర‌వు..
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహిళలపై దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్‌ రెడ్డి కనీసం స్పందించడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో మహిళలకు భద్రత లేదు, భరోసా లేదని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement